25 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబురం..విజెఎఫ్‌ ఘనంగా లోగో ఆవిష్కరణ

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబరం ప్రారంభంకానున్నటు ఫోరమ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్‌. దుర్గారావులు తెలిపారు. బుధవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ లోగోను పలువురు చేతులు మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రీడాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిఎమ్‌ఆర్‌ సౌజన్యంతో విశాఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ సహాకారంతో క్రమం తప్పకుండా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తువస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి విశాఖ పోర్టు

మైదానంలో ఇండోర్‌, ఆవుట్‌డోర్‌ గేమ్స్‌ నిర్వహిస్తామన్నారు. క్రికెట్‌తో పాటు ఆథ్లెటిక్స్‌, షటిల్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ తోపాటు వివిధ అంశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఫోటో, వీడియో జర్నలిస్టులు, వెబ్‌ చానల్స్‌ జర్నలిస్టులకు, ఈ పోటీలలో పాల్గోనే ఆవకాశం కల్పించామన్నారు. మహిళా జర్నలిస్టులకోసం వివిధ క్యాటగిరిలలో పోటీలు నిర్వహించడం జరుగుతుండన్నారు. పోటీలలో పాల్గొనే జర్నలిస్టులు అక్రిడేషన్‌ / విజెఎఫ్‌

సభ్యత్వం తప్పనిసరిగా కల్గివుండాలన్నారు. ఈ నెల 23లోగా తమ పంట్రీలను డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో విధిగా అందజేయాల్సివుంటుందన్నారు. అతిధులు చేతులు మీదుగా 25న పోర్టు మైదానంలో జర్నలిస్టుల క్రీడా పోటీలు ప్రారంభంమవుతాయన్నారు. రాష్ట్రస్ధాయి క్రీడలతోపాటు ఇంటర్‌మీడియా స్పోర్ట్స్‌మీట్‌ క్రమం తప్పకుండా నిర్వహించిన ఘనత వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరంకు దక్కుతుందన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు

ఆర్‌.నాగరాజ్‌పట్నాయక్‌, టి.నానాజీ, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కోశాధికారి పి.ఎన్‌.మూర్తి, స్పోర్ట్స్‌జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఉమాశంకర్‌బాబు, జి. సాంబశివరావు, విజెఎఫ్‌ కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌, ఎమ్‌.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, గిరిబాబు, వరలక్ష్మీ, గయాజ్‌, శేఖర్‌మంత్రి, విస్జా ప్రతినిధులు పైలా భాస్కర్‌, లెంక వెంకటరమణ, చుక్కల సత్యనారాయణ, పి.టి.ఐ. భాస్కర్‌ తదితరులు హాజరయ్యరు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*