నవంబర్‌లో విజెఎఫ్‌-సిఎంఆర్‌ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్…

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌, సిఎంఆర్‌ ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ను నవంబర్‌ తొలివారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఫోరమ్‌ అధ్య్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌. దుర్గారావులు తెలిపారు. మంగళవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన

పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లడుతూ విశాఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ సహకారంతో ఈ మీట్‌ను నిర్వహిస్తామన్నారు. పోర్టు-రైల్వే స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇండోర్‌ గేమ్స్‌ను ఆయా కేటగిరీలవారిగా జరుపుతున్నామన్నారు. నిరంతరం

సమాజాభివృద్ధి కోసం పాటుపడే జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుతో పాటు అన్ని వర్గాల వారికి ఈ క్రీడల వల్ల మానసిక ప్రశాంతతతోపాటు శారీరక దేహదారుడ్యం మెరుగుపడుతుందన్నారు. టోర్నీచైర్మన్‌గా ఎస్‌. దుర్గారావు వ్యవహరిస్తారని, కో-చైర్మన్‌లుగా ఉపాధ్యక్షులు, మిగిలిన సభ్యులు కొనసాగుతారన్నారు. ప్రమాద భీమా పాలసీని విజెఎఫ్‌

సభ్యులుకి చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీల విషయంలో ఎటువంటి అభ్యంతరాలున్నా ప్రెస్‌క్లబ్‌ కార్యాలయం పనివేళల్లో సంప్రదించవచ్చునన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజ్‌ పట్నాయక్‌, టి.నానాజి, కోశాధికారి పి.ఎన్‌.మూర్తి, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు పాల్గోన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*