బిసి సంఘం నేతలు రమ, జయ అభ్యర్ధన

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
బడుగు బలహీన వర్గాల జీవిత స్థితిగతులపై ప్రముఖ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తీసిన మార్కెట్ లో ప్రజాస్వామ్యం సినిమాని విజయవంతం చేయాలని బిసి యువజన సంఘం విశాఖ జిల్లా అధ్యక్షురాలు కోలాజయ, డి.రమ కోరారు. విశాఖలో వీరు మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాలో బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్. క్రిష్ణయ్య

కూడా మంచి పాత్ర పోషించారని అన్నారు. అన్నివర్గాలు చూడదగ్గ సినిమాను ప్రతీ బిసి చూసి సినిమాని ఆదరించాలని కోరారు. బడుగుల జీవితాలు కోసం బాహ్య ప్రపంచానికి తెలిసేలా దర్శకులు ఆర్.నారాయణ మూర్తి

సినిమాని ఎంతో చక్కగా తెరకెక్కించారని అన్నారు. ఎన్నో సినిమాలను ఆదరించిన ప్రజలు బడుగుల కోసం, నిరుపేదల జీవితాల కోసి తీసిన ఈ సినిమాని విజయవంతం చేయడం ద్వారా నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయడానికి అవకాశం వుంటుందని అన్నారు. త్వరలోనే విశాఖ సీతం పేట ప్రాంతం నుంచి 100 మంది బిసీ మహిళలతో సినిమాని వీక్షించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో బిసిసంఘం నాయకులు చెప్పారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*