దీపపు బుడ్డి వెలుతురులో ఆయుష్..వైద్యుల విధులకు వెళ్లరు…ఉన్నతాధికారులు పర్యవేక్షణకి దూరంగా ఈ ప్రభుత్వశాఖ

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖజిల్లాలో ఆ ప్రభుత్వ శాఖ అసలు ఎలా పనిచేస్తుందో జిల్లా అధికారులకు అనవసరం…డిస్పెన్సరీలు ఉన్నాయో లేదో కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించరు… అంతెందుకు ఈ శాఖలో వైద్యులు విధులకు వెళుతున్నారో లేదో కూడా ఎవరికీ తెలియనే తెలియదు…

మహా అయితే ఆ శాఖ కమిషనర్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు మాత్రం మేము విధులు నిర్వహిస్తున్నామంటూ వారంతా విధులు నిర్వహిస్తుంటారు…ఇప్పటికైనా అర్ధమైందా ఆ ప్రభుత్వ శాఖ ఏంటో…అదేనండి భారత ప్రధానమంత్రి మానస పుత్రిక శాఖ ఆయుష్….అదేంటి భారత ప్రధానికి అంత ఇష్టమైన ప్రభుత్వ శాఖను ఆంధ్రప్రదేశ్ లో అలా ఏమీ పట్టనట్టు వదిలేస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుందా…నిజమేనండి మీకు నమ్మకం కలగకపోతే…

మీరు అధికారులైతే ఆయుష్ శాఖకు సంబంధం ఉంటే అధికారులను తీసుకొని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుంళం ఆర్డీడీ పరిధిలో మూడు జిల్లాల్లో డిస్పెన్సరీలను తనిఖీ చేస్తే అర్ధమవుతుంది అక్కడ వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో. 70శాతం ఆసుపత్రులకుకరెంటు కూడా లేదు. దీంతో దీపపు బుడ్డి వెలుతురులో రోగులకు మందులిచ్చే దుస్థితి. దానికి తోడు కరెంటు సక్రమంగా లేని డిస్పెన్సరీల్లోవైద్యులు సుబ్బరంగా డుమ్మా కొట్టి విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంచక్కా అల్లోపతి ప్రాక్టీసులు చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయా

అనుకుంటున్నారా…ప్రతీ మూడు నెలల కొకసారి జరిగే రివ్యూ మీటింగ్ ఆయుష్ శాఖ భవనాలు, మౌళిక సదుపాయాల స్థితిగతులను రాజధానిలోని ఉన్నతాధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదక సమర్పిస్తారు. కానీ నివేదక, సమర్ఫణల వలన ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సుమారు 8ఏళ్లుగా చాలా డిస్పెన్సిరీల్లో విద్యుత్ సౌకర్యానికి నోచుకోకుండా పోయాయి. దీంతో దీపపు బుడ్డి వెలుతరులోనే ఇక్కడ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చే వైద్యులు రోగులకు సేవలందిస్తారు. అదేంటి వైద్యులు చుట్టపు చూపుగా వస్తే మరి ఆర్డీడీ ఏం చేస్తున్నారని ఈ వార్త చదివేవారికి

అనుమానం రావచ్చు…ఈయన కూడా ఆయా డిస్పెన్సరీలకు చుట్టపు చూపుగానే వెళుతుంటారు. గనుక నెలలో మూడు సార్లు రాజధానిలో సమావేశాలు….వారంలో రెండు సార్లు విశాఖ కార్యాలయంలో సమావేశాలు ఇన్ని జరుగుతున్నపుడు ఆర్డీడీ మాత్రం డిస్పెన్సరీల విజిటింగ్ ఏంచేస్తాం లే అనిచెప్పి మానేసి వైద్యులిచ్చిన నివేదికలను రాసేసుకొని రాజధానికి పంపిస్తున్నారు. ఇంతజరుగుతున్నా, విశాఖజిల్లాలోని కలెక్టర్ గానీ, జాయిట్ కలెక్టర్ గానీ, ఈశాఖను చూసే జెసి2 గానీ ఈ శాఖ కోసం కాస్త గట్టిగా ద్రుష్టి పెట్టింది లేదు. అలాని నిధులు లేవా అంటే ఆ కొరతా లేదు. కేంద్రం ఎన్

హెచ్ఎం నుంచి లక్షల రూపాయల నిధులు కుమ్మరిస్తుంది. కానీ ఈ శాఖలో పనిచేసే పార్మసిస్టులు, అటెంటర్లకు(కాంట్రాక్టు వారికి) సక్రమంగా జీతాలు రావడం లేదు. రెగ్యులర్ వైద్యులు, కాంపౌండర్లు వారిలో వారికి కుదుర్చున్న ఒప్పందం మేరకు వైద్యుడు వారంలో నాలుగు రోజులు డిస్పెన్సరీకి రావడం మానేస్తే, కాంపౌండరు మూడు రోజులు డ్యూటీకి రారు. ఇలా మూకుమ్మడి ఒప్పందాలతో భారత ప్రధాని మానస పుత్రిక ఆయుష్ శాఖను ప్రజల ఆయుష్

తీసే శాఖగా మార్చేశారు…కావాలంటే ఇప్పటికిప్పుడు ఎంత మంది వైద్యులు సక్రమంగా విధులకు హాజరవుతున్నారో జిల్లా కలెక్టర్ గానీ, జెసీ గాని ఆకస్మిక తనిఖీలు చేపడితే అసలు విషయం బయటపడుతుంది. పనిలో పనిగా డిస్పెన్సరీలకు వున్న మౌళిక వసతులు, భర్తీకాని ఖాళీల వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు…తెలుసుకొని మాత్రం ఏం చేస్తారంటారా…కనీసం వేలకి వేలు జీతాలు తీసుకొని ప్రజలకు సక్రమంగా సేవలందించని శాఖను గుర్తించిన జిల్లా కలెక్టర్, జెసిలుగా విశాఖలోని అధికారులు పేరు సంపాదించుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు….

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*