విశాఖలో డిసెంబరు 1 నుంచి లిటిల్ మోడల్ ఎర్త్2019…వాలంటీనీ మిశ్రా

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం కోసం లిటిల్ మోడల్ ఎర్త్ 2019 పేరిట అంతర్జాతీయ బాలోత్సవ్ ను డిసెంబర్ 1 నుంచి 7 వరకూ విశాఖపట్నంలోని వెల్కమ్ హోటల్ గ్రాండ్ బే లో అద్భుతమైన ప్రపంచ అందాల పోటీని

నిర్వహించడం అభినందించదగ్గ విషయ మని బాలీవుడ్ హీరోయిన్స్ & మోడల్స్ రిజ్డ్ మన్చందా, కవిత బ్రాన్ తా ఆదివారంనాడు హోటల్ మేఘాలయాలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా

ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు వాలంటీనా మిశ్రా మాట్లాడుతూ, దక్షిణ ఆఫ్రికాకి చెందిన అమందా క్రియిల్చే వ్యవస్థాపితమైన, దక్షిణ ఆఫ్రికాలోని ఎమోన్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా విశాఖలో ఈ లిటిల్ మోడల్ ఎర్త్ 2019 ” ప్రదర్శన జరుగుతుందని, ఈ ఎమోన్ ఏజెన్సీ లోగడ జోహాన్స్ఫర్డ్, కేప్ టౌన్, ప్రిటేరియాలో ఈతరహా ప్రదర్శనలకు హోస్ట్ గా వ్యవహారించిందని, విశాఖలో జరగబోయేది నాల్గవ ప్రదర్శన అని వెల్లడించారు. 4 నుంచి 17 సంవత్సరాల మధ్య వయోవర్గాలకు చెందిన బాలబాలికలు ఈ ప్రదర్శనలో పాల్గొనవచ్చని ఈ వయోవర్గాలను 4-7 సం. మినీ, 8-11 లిటిల్,

12-15 ప్రీటీన్, 16-18 టీన్గా వర్గీకరించారని ఆమె తెలియజేసారు. భారతదేశ వ్యాప్తంగా చెన్నయ్, ఢిల్లీ, ఒడిశా, ముంబాయి, విశాఖపట్నంలలో ఆడిషన్లు నిర్వహించమని, మోడల్ టాలెంట్ అంతర్జాతీయ పోటీలలో భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు తమ ఏజెన్సీ అవసరమైన శిక్షణ ఇచ్చి వాళ్ళను పోటీలకు సన్నద్ధం చేస్తామని చెప్పారు. సుమారు 20 దేశాల నుంచి చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ మీడియా చైర్మన్ చైతన్య జంగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.విజయ్ వర్మ, సి.ఇ.వో.సి. హెచ్ హరిలీలా ప్రసాద్, డైరెక్టర్ లంకా నారాయణ తదితరులు పాల్గొన్నారు

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*