జర్నలిస్టులు  క్రీడలు నిర్వహించడం ప్రశంసనీయం-ఎంపి ఎం.వి.వి.సత్యనారాయణ

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)

నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని విశాఖ పార్లమెంట్‌ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ కొనియాడారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్‌ సౌజన్యంతో విస్జా సహకారంతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడా పోటీల్లో భాగంగా శనివారం నాటి క్రికెట్‌ మ్యాచ్‌లకు ఎం.పి.ఎంవివి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపి ఎంవివి మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారంతోనే తాను ఎంపీగా ఉన్నత స్థానాన్ని అధిరోహించగలిగానన్నారు. బిల్డర్‌గా, పార్లమెంట్‌ సభ్యుడిగా తన ఎదుగుదలలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందన్నారు. జర్నలిస్టులు నిరంతర శ్రామికులని కొనియాడారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం గత 15 ఏళ్లకు పైగా క్రమం తప్పకుండా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలతో పాటు ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించుకోవడం వల్ల జర్నలిస్టులకు మానసిక ప్రశాంతతో పాటు మెరుగైన ఆరోగ్యం సాకారమవుతుందన్నారు.

రూ.8వేల కోట్లతో నగరానికి మెగా మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు ఏలేశ్వరం జలాశయం నుంచి నగరానికి నీరు తరలించేందుకు ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయా ప్రాజెక్టులకు జర్నలిస్టులు సహకారం అందించాలని ఎంవివి కోరారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, రోటరీక్లబ్‌ విశాఖవాలీ ప్రెసిడెంట్‌ బాబ్జి, లీడర్‌ పత్రిక సంపాదకులు వి.వి.రమణ మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు బులుసు ప్రభాకర్‌ శర్మ, పి.నారాయణ్‌ తదితరులు పాల్గొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.

వీజెఎఫ్‌ చేపడుతున్న కార్యక్రమాలు అన్ని ప్రాంతాలకు ఆదర్శనీయమని వీరు కొనియాడారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 3 వరకు 18 అంశాల్లో జర్నలిస్టుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫోటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులతో పాటు అందరికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వీజెఎఫ్‌ కార్యదర్శి ఎస్‌.దుర్గారావు మాట్లాడుతూ అందరి సహాకారంతోనే ఆయా కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నామన్నారు. ఈనెల 3వ తేదీన ఫైనల్స్‌ నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు అతిధులు చేతులు మీదుగా విజేతలకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.

ఈ సందర్భంగా అతిధులు కాసేపు క్రికెట్‌ ఆడి జర్నలిస్టులను ఉత్సాహపరిచారు. తదుపరి వీజెఎఫ్‌ కార్యవర్గం వారిని ఘనంగా సత్కరించింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రభ సునాయాసంగా విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. తదుపరి సాక్షి, విస్జా జట్ల మధ్య మరో మ్యాచ్‌ నిర్వహించగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి జట్ల మధ్య ఉత్సాహంగా మ్యాచ్‌లు జరిగాయి.

ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్ఫోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఉమాశంకర్‌ బాబు , జి సాంబశివరావు, పి.భాస్కర్‌, సూర్యప్రకాష్‌రావు, ఉపాధ్యక్షులు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌, టి నానాజీ, కోశాధికారి పిఎన్‌ మూర్తి, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరావు, ఎమ్మెస్సార్‌ ప్రసాద్‌, వరలక్ష్మి, దొండా గిరిబాబు, పైలా దివాకర్‌, గయాజ్‌, మాధవరావు,శేఖర్‌ మంత్రి, డేవిడ్‌ తదితర్లు పాల్గోన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*