విశాఖ మన్యంలోని అంతుచిక్కని వ్యాధులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..కొణతాలసీతారామ్

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖ ఏజెన్సీలో ప్రతీ ఏటా ఎపడమిక్ సీజన్ లో ప్రభలే అంతుచిక్కని వ్యాధులతో వందల మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి గిరిజనుల ఆత్మఘోష పట్టడం లేదని జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొణతాల సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభలే

వ్యాధులను గుర్తించి గిరిజనులకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాల్సిన ప్రభుత్వం గిరిజనుల జనాభా నియంత్రణకు వ్యాధులు సహాయం చేస్తున్నాయన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తుందని అన్నారు. ఇన్నీ ప్రాణాలు పోతున్నా పాడేరు ఐటిడిఏ పరిధిలో సంభవిస్తున్న మరణాలు, ప్రభలతున్న వ్యాధులపై ఎందుకు నిర్ధారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీతారామ్ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీలోని గిరిజనుల అభివ్రుద్ధికి ఐటిడిఏలు

ఉన్నా ఏం ఉపయోగ పడ్డాయో ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలన్నారు. పాడేరు ఐటిడిఏ పరిధిలోని 11 మండలాల్లో ప్రతీఏటా ఎపడమిక్ సీజన్ తోపాటు, ఆంత్రాక్స్ వలన, డెంగ్యూ, మలేరియా తోపాటు మరికొన్ని వ్యాధుల కారణంగా ఎంతో మంది గిరిజనులు మ్రుత్యువాత పడుతున్నారన్నారు. ఆ మరణాలపై కూడా వైద్య ఆరోగ్యశాఖ దొంగ లెక్కలు వేసి ప్రభుత్వ ద్రుష్టిని దారిమళ్లిస్తున్నదని ఆరోపించారు. వాస్తవానికి ఏజెన్సీ ఏరియాలో ప్రభలుతున్న వ్యాధుల నిర్ధారణకి ప్రత్యేక అధ్యయనం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఎప్పుడూ చేసే కార్యక్రమం

మలాథియన్ స్ప్రేయింగ్, దోమ తెరలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. ఏజెన్సీలోని మలేరియా దోమపై మలాథియన్ స్ప్రెయింగ్ కూడా పనిచేయడంలేదనే విషయాన్ని ఆరోగ్యశాఖ ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లలేదన్నారు. తద్వారా వర్షాకాలంలో వచ్చే ఎపడమిక్ సీజన్ లో గిరిజనులు మ్రుత్యువాత పడుతున్నారన్నారు. దానికి తోడు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో సైతం వ్యాధినిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరగడం లేదని, చాలా చోట్ల ల్యాబ్ టెక్నీషియన్లు కూడా లేరన్నారు. కొన్ని చోట్ల ఉన్నా మలేరియా పరీక్షలు తప్పితే, టైఫాయిడ్, ఇతర వైద్య పరీక్షలు చేసే అవకాశం పిహెచ్సీల్లో

లేవని అన్నారు. వున్న మలేరియా కిట్టు కూడా అరకొరగానే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజనుల ఆరోగ్యం కోసం అటు ప్రభుత్వం గానీ, వారికే కోసమే ఏర్పాటు చేసిన ఐటిడిఏలు కానీ ఎందుకు ద్రుష్టి సారించడం లేదని ప్రశ్నించారు. నిధులకు కొరత లేదని ఎప్పుడూ ప్రచారం కోసం ప్రకటనలు చేసే ప్రభుత్వం కనీసం వ్యాధినియంత్రణ కోసం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, వ్యాధి నిర్ధారణ కిట్టు కూడా పెట్టడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విశాఖ మన్యంలోని 11 మండలాల్లో

ప్రభులుతున్న తున్న వ్యాధులపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడంతోపాటు, ప్రత్యేక వ్యాధినిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా అన్ని ప్రాధమిక వైద్య కేంద్రాల్లో ఖచ్చితంగా ఇద్దరిద్దరు చొప్పున ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని, అన్నిరకాల వైద్య పరీక్షలు చేసే విధంగా ఆటో మల్టీ డిసీజ్ ఎనలైజర్లను పిహెచ్సీల్లో ఏర్పాటు చేయాలని జై అనకాపల్లి సేన అధ్యక్షులు కొణతాల సీతారామ్ ప్రభుత్వాన్ని గిరిజను ఆరోగ్యం కోసం డిమాండ్ చేశారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*