క్రీడలతో మెరుగైన ఆరోగ్యం..ఇండియన్‌ రైల్వే బాక్సింగ్‌ కోచ్‌ దుర్గాప్రసాద్‌

(విశాఖపట్నం,ఈఎన్ఎస్)
వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్‌, విస్జా సహకారంతో నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లో బాగంగా క్రికెట్‌ పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. పోర్టు మైదానం వేదికగా శుక్రవారం ఆరు జట్లు మధ్య మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ పోటీలను ఇండియన్‌ రైల్వే బాక్సింగ్‌ కోచ్‌ దుర్గాప్రసాద్‌, విశాఖ రైల్వే బాక్సింగ్‌ కోచ్‌ ఆదినారాయణ లు ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా జట్ల క్రీడాకారులను తొలుత వీరు పరిచయం చేసుకున్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ సమాజం కోసం శ్రమించే జర్నలిస్టులకు క్రీడలు అత్యంత అవసరం అన్నారు. దీని వలన మెరుగైన ఆరోగ్యం తో పాటు అపారమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవకాశలు ఏర్పాడుతాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ పాలకవర్గం హయంలో సభ్యులు సంక్షేమంతొ పాటు రాష్ట్ర స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు.

డిసెంబర్‌ 3 వరకు ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ జరుగుతుందన్నారు. విజెఎఫ్‌ కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ అందరి సహకారంతో ఆయా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్ఫోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఉమాశంకర్‌ బాబు , జి సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఆర్‌ నాగరాజ్‌ పట్నాయక్‌, టి నానాజీ, కోశాధికారి పిఎన్‌ మూర్తి, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరావు, ఎమ్మెస్సార్‌ ప్రసాద్‌, వరలక్ష్మి, దొండా గిరిబాబు, పైలా దివాకర్‌, గయాజ్‌, మాధవరావు,శేఖర్‌ మంత్రి, డేవిడ్‌ తదితర్లు పాల్గోన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*