స్పందన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత…డిప్యూటీ తహశీల్దార్ గురుమూర్తి

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖ అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో 18 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అధికంగా ఒంటరి మహిళల సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్టు డిప్యూటీ తహశీల్దార్ గురుమూర్తి తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు స్పందన దరఖాస్తులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా కుల ద్రువీకరణ, లీగల్ హైర్ ద్రువపత్రాలకు సంబంధించిన వినతులు వచ్చాయన్నారు.

ప్రతీ దరఖాస్తుకి రసీదు ఇవ్వడంతోపాటు, పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా పరిష్కారం కాని దరఖస్తులకు నిర్ణీత కారణాలు సైతం దరఖాస్తులకు తెలియజేస్తున్నట్టు డిటి వివరించారు. స్పందనపై ప్రజలకు నమ్మకం పెంచేవిధంగా సేవలు అందిస్తున్నట్టు ఆయన వివరించారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*