నువ్వులనూనెని దైనిందన జీవితంలో జతచేసుకుంటే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు

(ఈఎన్ఎస్, ఆరోగ్యవిభాగం)
* ప్రతిరోజు తలకు నువ్వులనూనె పెట్టుకుంటే తలనొప్పి , వెంట్రుకలు రాలడం , తెల్లబడటం ఏర్పడదు . తల ఎముకలకు మంచి బలం

కలుగును. తలవెంట్రుకలు దిట్టమైనవి , పొడవైనవి , నల్లనైనవి ఏర్పడును . ఙ్ఞానేంద్రియాలకు మంచి బలం కలుగును. ముఖం యొక్క చర్మానికి నునుపుదనం వస్తుంది. మంచినిద్ర కలుగును.

* ఉదయాన్నే నువ్వులనూనె నొటియందు ఉంచుకుని పుక్కిలి పట్టడం ద్వారా దౌడ ఎముకలకు , స్వరపేటికకు మంచి బలం

కలుగును. ముఖపుష్టి ఏర్పడును . నాలుకకు తీపి మొదలగు రుచులను ఆశ్వాదించే శక్తి పెరుగును . ఆహారంలోని రుచి తెలుస్తుంది. గొంతు ఎండుకుపోవు సమస్య తగ్గును. పెదవులపగుళ్ళు రావు . పళ్ళు అరుగుదల ఉండదు. దంతాల బలం

పెరుగును పండ్లనొప్పి , పండ్లకు పులుపు , చాలా చల్లటి ఆహారపదార్థాలు , ద్రవాలు పండ్లకు తగులుటచేత కలుగు బాధ నివారణ అయ్యి కఠినమైన పదార్థాలను సైతం ముక్కలుగా కొరకగల శక్తి దంతములకు లభించును.

* నువ్వులనూనెను పుక్కిటలో కొంచంసేపు ఉంచి బాగ పుక్కిలించవలెను . తెల్లగా నురగ వచ్చునంతవరకు పుక్కిలించవలెను . ఈ ప్రక్రియ దంతధావనానికి ముందు సుమారు 10 నిమిషాలపాటు చేయవలెను . ఆతరువాత చన్నీటితో గాని వేడినీటితో గాని నోరును శుభ్రపరచుకోవలెను . ఈ విధముగా చేయుటవలన పైనచెప్పిన సమస్యలు అన్నియు తీరును .

* ప్రతినిత్యం నువ్వులనూనెతో తలంటుకోవడం వలన త్వరగా ముసలితనం రాదు . అలిసిపోవడం , ఒళ్లునొప్పులు ఉండవు. కండ్లకు తేటదనం వచ్చును. బలం కలుగును. ఆయుష్షు వృద్ధిచెందును. మంచినిద్ర పట్టును . ప్రతినిత్యం తలంటుకొవడం కుదరకున్న కనీసం వారానికి ఒకసారైనా తలంటుకోవలెను.

* ప్రతినిత్యం చెవిలో నువ్వులనూనె రెండుచుక్కలు వేసుకొవడం వలన చెవినొప్పి లాంటి వాత సంబంధమైన చెవిరోగాలు , మెడవెనక భాగం నందు ఉండు నరాలు పట్టుకుపోవడం , చెవుడు సమస్యలు ఏర్పడవు. చెవిలో నూనె వేసుకొని రెండుమూడు నిమిషాలు ఉంచి పక్కకు వంగి ఆ నూనె బయటకి విడువవలెను . అలానే చెవిలో ఉంచుకోకూడదు. నువ్వులనూనె కొంచం గోరువెచ్చగా చేసి వెసుకొనవలెను.

* అరికాళ్లకు నువ్వులనూనె పూసుకోవడం వలన కాళ్లు గట్టిగా ఉండటం , పట్టుకొనిపోవుట , గరగరలాడుచుండుట , తిమ్మిరి , పట్టినట్లు ఉండటం వంటి సమస్యలు తొలగిపోయి కాళ్లకు మెత్తదనం , బలం , ధారుడ్యం ఏర్పడును . కాళ్లనొప్పి , పోటు , గృదసీవాతం రాదు . పగుళ్లు ఏర్పడవు . నాడులు , నరాలు ముడుచుకుపోవడం వంటి సమస్యలు దరిచేరవు .

ఇంకెందెకాలస్యం…మీరు కూడా నువ్వుల నూనెని దైనందిన జీవితంలో జతచేసుకొని దాని ద్వారా వచ్చే లాభాలు పొంది ఆరోగ్యవంతులు కండి…

<script async src=”//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: “ca-pub-9416731088160793”,
enable_page_level_ads: true
});
</script>

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*