ఊడిపోయిన తల వెంట్రుకలు తిరిగి ఒత్తుగా మొలవాలంటే…ఆరకంగా

(ఈఎన్ఎస్, ఆరోగ్యవిభాగం)
ఇపుడు అన్ని వర్గాల వారిని వేధిస్తున్న సమస్య వెంట్రుకలు ఊడి పోవడం, త్వరగా తెల్లబడిపోవడం. 18 ఏళ్ల యువత నుంచి 65 సంవత్సరాల వయసు గలిగిన ముసలి వారు కూడా

ఈ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా జరగడానికి కారణం శరీరంలోని కాలిష్యం, ప్రొటీన్ , ఐరన్ లోపమే అంటున్నారు. వైద్య నిపుణులు యుక్త వయస్సు

వచ్చిన దగ్గర నుంచి జంక్ ఫుడ్ అధికంగా తినడం వలన కూడా వెంట్రుకలపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. శిరోజాల సంరక్షణ మన చేతుల్లో

ఉన్నప్పటికీ యాంత్రిక జీవితంలో దానిని పాటించడానికి సమయం దొరకడం లేదు. ఫలితం చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోయి బట్టతల వరకూ దారితీస్తుంది.

ఆకుకూరలు, పాలు, గుడ్లు, చేపలు అధికంగా తినడం ద్వారా ప్రొటీన్ శరీరానికి అంది తద్వారా వెంట్రులు ఒత్తుగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు

చెబుతున్నారు. అయితే వీటిని తీసుకోవడంలో మాత్రం ఎవరూ అంతగా శ్రద్ధ చూపించడం లేదు. మునగాకు, అలోవెరా, తులసి వంటివి కూడా జుట్టు ఒత్తుగా

పెరగడానికి ఎంతో సహకరిస్తాయి. కానీ వీటి జోలికి కూడా ఎవరూ వెళ్లపోవడం వలన వెంట్రుకలు రాలిపోయే సమస్యను అధికంగా ఎదుర్కోవలసి వస్తుంది.

అలాని వాటికోసం మందులు వేసుకుంటే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అదే స్థాయిలో వుంటున్నాయి. హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలతో

మంచిఫలితాలు ఉన్నప్పటికీ అవి కాస్త ఆలస్యంగా ప్రభావం చూపిస్తుండటంతో వాటిని కొద్ది మంది మాత్రమే వినియోగిస్తున్నారు…

శిరోజాల సంరక్షణకి ఇలా చేస్తే సరి…
ప్రతినిత్యం ఆహారంలో పప్పు, మునగాకు, మెంతుకూరలను తినాలి. వెన్న అధికంగా వుండే పాలను ప్రతీరోజూ తీసుకోవాలి. అదే సమయంలో

కోడిగ్రుడ్లు కూడా కేశాల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే విధంగా అన్ని రకాల ఆకు కూరలు, చేపలు కూడా ఎంతో మేలును చేస్తాయి.

వెంట్రుకలు బాగా ఎదగాలంటే కనీసం వారానికి ఒకసారైనా పాలను జుట్టుకి పట్టించాలి. పన్నీరు, పుట్టకొక్కులు(మష్రుమ్స్)

తరచుగా తీసుకోవాలి. ప్రతినిత్యం రాగిమాల్ట్ తాగే వారిలో జుట్టు తెల్లబడటం చాలా వరకూ తగ్గుతుంది. రాగిమాల్ట్ లో ఐరన్ అధికంగా వుంటుంది. తద్వరా వెంట్రుకలు బలంగా పెరుగుతాయ్.

ఈ తైలం జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది…
కానుగ పూల రసం, ఉల్లిపాయల రసం, లేదా ముల్లంగి రసాన్ని వెంట్రుకలు ఊడిపోయిన రాత్రులు పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయాన్నే మళ్లీ

దానిని త్రిఫలా కషాయం(త్రిఫలా చూర్ణాన్ని నీటిలో వేగి మరింగించాలి ఆ నీటిని)తో తలకి మర్ధనా చేయాలి. దీనితోపాటు గుంట గలర ఆకుని నువ్వుల

నూనెలో వేసి మరిగించి దానిని ప్రతినిత్యం తలకి పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా కూడా ఊడిపోయిన వెంట్రుకలు బలంగా

ఒత్తుగా మొలుస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని కూడా ఒక క్రమ పద్దతిలో వాడకపోతే మాత్రం నూనెలు, తైలాల వాసన అధికంగా వస్తుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.

<script async src=”//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: “ca-pub-9416731088160793”,
enable_page_level_ads: true
});
</script>

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*