విశాఖ ఉత్సవ్ కి జీసీసీ చక్కటి కాఫీ స్వాగతం…ఏయిర్ పోర్టులో ప్రత్యేక కౌంటర్…దేశీయులతో సహా విదేశీయులను పలుకరించిన అరకు కాఫీ

(విశాఖపట్నం, ఈఎన్ఎస్ నెట్వర్క్)
ప్రతినిత్యం ఉదయభానుడి లేలేత కిరణాలు మనల్ని తాకే సమయంలో తాగే ఓ కప్పు కాఫీ కోసం ఇపుడు అంతా అరకువేలీ జీసీసీ కాఫీ కోసం అంతా ఎదురుచూసే పరిస్థితి…అంతలా విశాఖ మన్యంలో దొరికే నాణ్యతగల కాఫీ పిక్కల నుంచి తయారుచేసిన ఈకాఫీ అందరి మదిలో చెరగని ముద్రవేసుకుంది. మనసు ప్రసాంతత కోసం తాగే ఓ కప్పు కాఫీలో ఏమాత్రం రాజీ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అరకు కాఫీనే తాగాలన్నట్టుగా అంతా జీసీసీ కాఫీకి ఫిదా అయిపోయారు. ఇంతటి ప్రపంచ దేశాల మన్ననలు పొందిన అరకు కాఫీ రుచి విశాఖ ఉత్సవ్ లో అంతే గౌరవాన్ని సంపాదించింది. విశాఖ ఉత్సవ్ సందర్భంగా మూడు రోజుల పాటు దేశ విదేశీయులకు విశాఖ ఏయిర్ పోర్టులో చక్కని ఆహ్వానం పలికింది. దేశీయ కాఫీ రుచులను అందరికీ రుచి చూపించింది. విశాఖ ఉత్సవ్ కి వచ్చే వారంతా ఏయిర్ పోర్టులో ఓ కప్పు కాఫీ తాగి ఆహా అంటూ బయటకి వచ్చేలా వారిని ఆకట్టుకుంది. మూడు రోజుల పాటు నగరానికి వచ్చే వచ్చేవారందరికీ ఎంతో చక్కగా ఏయిర్ పోర్టులోనే జీసీసీ నిర్వాహకులు కాఫీ రుచులను అందించగలిగారు. విశాఖలోనే కాదు రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో జీసీసీ అరకు కాఫీ స్టాల్ ఉండకుంటా అసలు కార్యక్రమాలే జరగడం లేదంటే దీని రుచికి అటు ప్రభుత్వం గానీ, నిర్వాహకులు గానీ ఏ స్థాయిలో అలవాటు పడ్డారో అర్ఢం చేసుకోవచ్చు. విశాఖలో జరిగే అన్ని అంతర్జాతీయ కార్యక్రమాల్లో అరకు జీసీసీ కాఫీ స్టాల్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. విశాఖ ఉత్సవ్ లో ఉత్సవం జరిగేచోట కాఫీ స్టాల్ ఏర్పాటు కాకపోయినా, ఏయిర్ పోర్టులో దీనిని ఏర్పాటు చేయడం ద్వారా మూడు రోజుల పాటు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కాఫీ రుచి చూసిన వారంతా తమతోపాటు కొన్నిరోజులు జీసీసీ అరకువేలీ కాఫీ తాగడం కోసం ఒక కాఫీ ఫ్యాకెట్ ను కొనుగోలు చేసుకొని వెళ్లేలా చేసింది.

అరకువేలీ కాఫీకి బ్రాండ్ ఇమేజి మరింత తేవడం కోసమే…జీసీసీ వీసీ అండ్ ఎండి ఆకెళ్ల రవిప్రకాష్
విశాఖజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే అరకువేలీ కాఫీకి బ్రాండ్ ఇమేజిని మరింత పెంచాలనే లక్ష్యంతో పాటు దీని రుచిని ప్రపంచ దేశాలకు పరిచియం చేయడం కోసం ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జీసీసీ స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ ఎగుమతుల ద్వారా ఇప్పటికే అరకు కాఫీకి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి మేకిన్ ఇండియా నినాదంతో, ఆంధ్రప్రదేశ్ లోని మేకిన్ ఏపిని ఆదర్శంగా తీసుకొని మేకిన్ విశాఖ అరకు జీసీసీ కాఫీ రుచి ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్లాలనే ద్రుడ సంకల్పంతో జీసీసి శ్రమిస్తోందన్నారు. గతంలో కాంటే జీసీసీ అరకు కాఫీకి మంచి ప్రాచుర్యం వచ్చిందన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అన్ని కార్యక్రమాల్లో జీసీసీ స్టాల్ కి ప్రత్యేక అనుమతులు ఇవ్వడం వలన కూడా అరకు కాఫీకి ఇంతటి పేరు వచ్చిందని చెబుతున్నారు. తాగితే అరకు వేలీ కాఫీనే తాగాలని ప్రతీ ఒక్క కాఫీ ప్రేమికుడు అనుకునేంత స్థాయి దీనిని తీసుకెళ్లడంతోపాటు, గిరిజనులు పండించే ఈ కాఫీకి మంచి మార్కెట్ చేయడం కోసం జీసీసీ తీవ్రంగా శ్రమిస్తుందని చెబుతున్నారు జీసీసీ ఎండి, వీసి ఆకెళ్ల రవిప్రకాష్. ఇంతగా చెప్పిన అరకువేలీ కాఫీ ని తాగితే కదా దాని మజా ఏంటో తెలిసేది…

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*