మహాత్ముని సేవలు మరువలేనివి.. వైఎస్సార్సీపీనేత గండి జ్యోతి

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
భారత స్వాతంత్య్ర పోరాటంలో జాతిపిత మహాత్మగాంధీ అందించిన సేవలు మరువలేనివని విశాఖజిల్లా వైఎస్సార్సీపీ పార్లమెంటు జాయింట్ సెక్రటరీ గండి జ్యోతి కొనియాడారు. బుధవారం జీవిఎంసీ గాంధీ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

మహాత్మాగాంధీ 150వ జయంతి నేటికీ భారతీయులంతా ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దానికి ఆయన దేశానికి చేసిన సేవలేనన్నారు. గాంధీజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. గాంధీజి

కలలు గన్న స్వరాజ్యాన్ని తీసుకురావడానికి సీఎం వైఎస్ జగన్ గ్రామసచివాలయాలను ఆయన స్పూర్తితోనే ప్రారంభించారని అన్నారు. ఇంతకంటే గాంధీ చేసిన సేవలను అనుసరిస్తున్నారడానికి నిదర్శనం ఏముంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*