గాంధీజి ఆశయ సాధనకు కృషిచేద్దాం..150వ జయంతోత్సవ పుస్తుకం విడుదల

(విశాఖపట్నం,ఈఎన్ఎస్)
మహాత్ముడు ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్‌ అన్నారు. బుధవారం జీవిఎంసీ గాందీ విగ్రహం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ గొప్పతానాన్ని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు వివరించారు. అహింస, ఉప్పు సత్యగ్రహం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి గాంధీజీ ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగారన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ పై రూపకల్పన చేసిన ప్రత్యేక పుస్తకాన్ని పలువురుతో కలిసి ఆవిష్కరించారు.

లాల్‌బహుదూర్‌శాస్త్రి జయంతి

జీవిఎంసీ ఎదురుగా ఉన్న లాల్‌బహుదూర్‌ శాస్త్రి విగ్రహానికి వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఫూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో విజెఎఫ్‌ కార్యవర్గ సభ్యుడు పైలా దివాకర్‌, మాజీ కార్పోరేటర్‌ సేనాపతి అప్పారావు తదితరులు పాల్గోన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*