(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై చేసిన వీరోచిత పోరాట పుణ్యభూమి క్రిష్ణదేవిపేటను ఎవరూ కేడిపేటగా పిలవకుండా చూడాలంటూ అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివశంకర్ కు అర్జిపెట్టారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భరతజాతి గర్వించదగ్గ అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం బ్రిటీషు ప్రభుత్వంపై చేసిన పుణ్యభూమిని చులకనగా చేసి పిలిచే పిలుపును ప్రభుత్వపరంగా నియంత్రించాలని ఆ అర్జీలో పేర్కొన్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాలల ద్వారా కేడిపేట అనే గ్రామాన్ని గెజిట్ లో ఉన్న విధంగా క్రిష్ణదేవిపేటగానే పరిగణించి, ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని ఆ అభ్యర్ధనలో కోరామన్నారు.
ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యభూమి క్రిష్ణదేవిపేటను కేడిపేటగా పిలవడం బాధాకరమన్నారు. ప్రజలంతా ఆ గ్రామాన్ని క్రిష్ణదేవిపేటగానే సంభోదించాలని ఆయన కోరారు. అల్లూరికి ఏపి ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించిన తరుణంలో ఆయన పోరాటం చేసిన ప్రాంతాన్ని కూడా అంతే పవిత్రంగా పిలవాలనే అభ్యర్ధపై జాయింట్ కలెక్టర్ శివశంకర్ కూడా స్పందించి అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వెఎస్.జగన్మోహనరెడ్డి తోపాటు పీఎంఓలోని ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా లేఖలు పంపినట్టు బాలు తెలియజేశారు.
Leave a Reply