విధులకు చేరని గ్రామ,సచివాలయ కార్యదర్శులపై చర్యలు..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ 

(పాడేరు, ఈఎన్ఎస్)

గ్రామసచివాలయ నియామక ఉత్తర్వులు పొంది విధులకు చేరని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డి. కె. బాలాజీ స్పష్టం చేసారు. శనివారం ఈ మేరకు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రజలకు సత్వరమే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సెక్రటరీ, రెవెన్యూ, సర్వే మరియు భూ రికార్డులు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, పశు సంవర్దకశాఖ, మత్స్య, పట్టు పరిశ్రమ శాఖ కార్యదర్శుల పోస్టులను యుద్ద ప్రాతిపదికన భర్తీ చేయడం జరిగిందన్నారు.

ఎంపికైన అభ్యర్దులకు నియామక ఉత్తర్వులు అందిజేసామని చెప్పారు. అవసరమైన శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్దులు వారికి కేటాయించిన శాఖల్లో వెంటనే విధులకు చేరి సేవలందించాలని సూచించారు. విధుల్లో చేరకుండా తాత్సారం చేస్తే తొలగించడానికి వెనుకాడమని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ, వై ఎస్ ఆర్ రైతు భరోసా, వై ఎస్ ఆర్ క్రాంతి వెలుగు పధకాలు మంజూరు చేయడానికి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడానికి సిబ్బంది కొరత రెవెన్యూశాఖకు తీవ్రమైన భారంగా ఉంటోందన్నారు.

ఎక్కవ శాతం ప్రభుత్వ పధకాలు రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. వివిద శాఖలలో సేవలందించ వలసిన సిబ్బంది మండల అభివృద్ది అధికారు వద్దే ఉంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ కి కేటాయించిన ఎ ఎన్ ఎంలు వైద్య ఆరోగ్య శాఖలో సేవలందించాలని ఆదేశించారు. ఎం.పి.డి . ఓ కార్యాలయాలకు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు హజరు కావడం లేదని తమ దృష్టి వచ్చిందన్నారు. వెంటనే ఎం ఎన్ ఎంలకు కేటాయించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు. ప్రస్తుతం ఇమ్యునైజేషన్ కార్య క్రమం జరుగుతోందన్నారు.

ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. హార్టీకల్చర్ సహాయకులు ఐటిడి ఏ ఉద్యాన వన అధికారికి రిపోర్టు చేయాలని సూచించారు. ఏశాఖకు కేటా యించిన సిబ్బంది విధగా వారికి కేటాయించిన శాఖలో పని చేయాలని, విధులను విస్మరిస్తే జీతాలు నిలుపుదల చేయడం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాతృ శాఖ, ఇతర శాఖల సమన్వంతో పౌరులకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలని చెప్పారు. అన్ని రకాల సేవలు ఒకే గోడుగు కింద అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయ మన్నారు. వి ఆర్ ఓ లు ,సర్వేయర్లు తాహశీల్దారులకు రిపోర్టు చేయాలని దానికి అనుగుణంగా ఎం పి డి వోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర సచివాలయ సిబ్బంది తమ మాతృశాఖలో రిపోర్టు చేయాలన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*