కళాభారతిలో వీనుల విందుగా సాగిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖలోని కళాభారతిలో నిర్వహించిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ వీనుల విందుగా సాగింది. మద్దెలపాలెంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు డా.మహర్షి దర్శకత్వంతో క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజి విద్యార్ధులు క్రీస్తు సంగీతాలు శాస్త్రీయంగా పాడారు.

ముఖ్యంగా మధురం మధురం అనే పాట ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కళాశాలలో శిక్షణ పొందిన విద్యార్ధులు వాయిద్యాలను వాయించారు. అంతేకాకుండా సంగీత దర్శకులు మహర్షి కూడా గాయకులతోపాటు పాటలు పాడారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, దేవుని మహిమను స్థుతిస్తూ సువార్త వాక్యాలను చదివి వినిపించారు.

ఎంతో భక్తిరసంగా సాగిన ఈ కార్యక్రమంలో గాయకులు మనో ఇమ్మానియేల్, రాజాబాబు, రవికిరణ్ లు, వాయిధ్య కళాకారులు ఎరికాకె ఆర్గాన్స్(హార్ప్), ఏఎస్ జాన్( ఫ్లూట్),నరేస్ (గిటార్), కిమ్ ఫెయిర్ మన్ (డ్రమ్స్) మెల్విన్ పెరైరా,పాస్టర్లు సుధాకర్ , విక్టర్ పాల్ ,నెహేమ్యా ,నవీన్ కుమార్ ,ప్రుద్వి ధీరజ్,ప్రీతం ధీరజ్,ఆరోన్,షీలా జోసెఫ్,నవీన్,సందీప్,హర్ష, జూడాధరహాస్, జయ, నిర్మల, సుజినీ, మణి,హెబ్సీబా, ప్రియాంకిత, నిస్సీ జొకాబెత్ , అమ్రుత, కేరల్, రిశితా షారన్, అభిలాశా షారన్, సలోమీ దీవెన, షైని, రూత్ గ్రేస్, ఎరీకా కె ఆర్గాన్ , జాయ్, జెస్సీ  తదితరులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*