7న సాయుధ దళాల పతాక దినోత్సవం – జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్

December 6, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) సాయుధ దళాల పతాకదినోత్సవాన్ని ఈనెల 7వ తేదీన జరుపుకోనున్నామని,  వీర జవానుల కుటుంబాలకు చేయూత నిచ్చేందుకు పతాక నిధికి విరివిగా విరాళాలు అందించవలసినదిగా జిల్లాలోని పౌరులను, వ్యాపార వేత్తలను, పారిశ్రామిక దారులను జిల్లా కలక్టరు డా. ఎం.  హరి జవహర్ లాల్ విజ్ఞప్తి  చేసారు. జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాకదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి , సాహసం, త్యాగాల పట్ల దేశం గర్వించుచున్నదన్నారు.  పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాలలోను, కార్గిల్ పోరాటంలోను, బొంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతి యావత్తు గర్వించుచున్నదన్నారు. ఎంతో మంది సైనిక సహోదరులు దేశ రక్షణ కొరకు […]

బాల బాలికల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తే శిక్షార్హులు..సీనియర్ సివిల్ జడ్జి వి. లక్ష్మీరాజ్యం

November 14, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) నేటి బాలలే  రేపటి పౌరులని, బాలల హక్కులను భంగం కలగరాదని, బాలల హక్కులను కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ వి. లక్ష్మీరాజ్యం బాలలను ఉద్ధేశించి అన్నారు.  […]

హెల్ప్ డెస్క్ఏర్పాటు

November 7, 2019 Eerojunews 0

(విజ‌య‌న‌గ‌రం, ఈఎన్ఎస్) రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న రాయితీల‌ను వినియోగించుకొని ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావాల‌ని జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కోట ప్ర‌సాద‌రావు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్ధిక […]

జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్

November 4, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్)  ఆనంద గజపతి ఆడిటోరియంలో నవంబరు 5వ తేదీన నిర్వహించనున్న స్పందన శిక్షణా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని  జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  సోమవారం జిల్లా కలక్టరు […]

 జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్

November 4, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా జరుగుచున్న నిర్మాణ పనులకు ఏ మాత్రం ఇసుక కొరత లేకుండా చూడాలని రెవిన్యూ, ఘనుల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. సోమవారం […]

– అవినీతి నిరోధక శాఖ డి.ఎస్పీ. బి.వి.ఎస్.నాగేశ్వరరావు

October 28, 2019 Eerojunews 0

(విజయనగరం,ఈఎన్ఎస్) సమాజంలో అవినీతిని నిర్మూలించి పాదర్శకతతో కూడిని పాలనను ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్నదని  ఆ శాఖ డి.ఎస్పీ. బి.వి.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం తమ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ విజిలెన్సు కమిషన్ ప్రతి ఏడాది అక్టోబరు నాల్గోవారంలో అవినీతి వ్యతిరేఖ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ ఏడాది ‘’సమగ్రత – జీవన విదానం’’ అనే నినాదంతో నేటి నుండి వారం రోజుల పాటు అవినీతి వ్యతిరేఖ అవగాహనా కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి నిర్మూలనా కార్యక్రమాలపై ప్రజల్లో ప్రత్యేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అవినీతి నిర్మూలనతోనే  సమాజం ఉద్దరించబడుతుందని, అవినీతి సమాచారాన్ని  తమకు తెలియజేసి నవ సమాజ నిర్మాణానికి తోడ్పడాల్సిన భాద్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు నీతి నిజాయితీతో ప్రజలను మెరుగైన సేవలు అందజేయాల్సి ఉందని, అటు వంటి ఉద్యోగులు అవినీతి పాల్పడితే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన ఆ వివరాలను తమకు తెలియపరిస్తే చట్టప్రకారం వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. టోల్ ఫ్రీ నెం.1064, వాట్సాఫ్ నెం.8333995858, ఫేస్బుక్ నెం.dgacbap, ట్విటర్ నెం.@dgacbap, వెబ్ సైట్ www.acbapgov.in, ఇ-మెయిల్ dg_acb@ap.gov.in తదితర మాధ్యమాల ద్వారా అవినీతి సమాచారాన్ని తమకు అందించవచ్చన్నారు. అదే విధంగా 9440446174/ 9440446176 /9440446179 / 9491305633 తదితర నెంబర్లకు నేరుగా ఫోన్ చేసి కూడా అవినీతి సమాచారాన్ని అందజేయవచ్చు అని ఆయన తెలిపారు.         ఈ వారోత్సవాల్లో భాగంగా తొలిరోజైన సోమవారం అవినీతి నిరోధక శాఖ డి.ఎస్పీ. బి.వి.ఎస్.నాగేశ్వరరావు నేత్వత్వంలో అవినీతి నిరోధక శాఖ అదికారులు, సిబ్బంది అవినీతికి వ్యతిరేఖంగా ప్రతిజ్ఞ చేశారు.  రెండో రోజైన 29 న  కరపత్రాలు పంపిణీ, గోడపత్రికలు అతికించడం జరుగుతుందని, మూడో  రోజైన 30 న అవినీతి నిరోధక అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  అదే విధంగా 31 వ తేదీన నగరంలోగల పి.ఎస్.ఆర్.కాంప్లెక్సు నుండి అవగాహన ర్యాలీని ని ర్వహిస్తామని, నవంబరు 1 న పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు డిబేట్, క్విజ్, వ్యాసరచ పోటీలు నిర్వహస్తామని,ఈ పోటీల్లో విజేతలకు 2 వ తేదీన  బహుమతుల ప్రధానోత్సవం మరియు వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. నగరంలోని ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛంధంగా ఈ వారోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.         ఈ వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ ప్రచురించిన పోస్టర్లు, కరపత్రాలను ఆ శాఖ డి.ఎస్పీ. బి.వి.ఎస్.నాగేశ్వరరావు, ఇన్ స్పెక్టర్లు ఎమ్.మహేశ్వరరావు, కె.సతీష్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు.

మిగిలిన పోస్టులకు రెండవ రోజు కొనసాగిన దృవపత్రాలు పరిశీలన

October 22, 2019 Eerojunews 0

(విజయనగరం,ఈఎన్ఎస్)    మిగిలిన  గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల దృవపత్రాలను రెండవ రోజైన మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో  పరిశీలించారు.  కొందరు అభ్యర్దులు  మూడు, నాలుగు పోస్టులకు ఎంపికయ్యారు.  అలాంటివారి నుంచి […]

స్పందనకు గైరుహాజరైన జిల్లా అధికారులకు తాఖీదులు-జెసి కె.వెంకట రమణా రెడ్డి

October 7, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) స్పందనకు గైరుహాజరైన జిల్లా అధికారులకు తాఖీదులు జారీచేయాలని  జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి కలక్టరేట్ అధికారులను ఆదేశించారు. జిల్లా  కలెక్టరేట్లో సోమవారం ఆయన అద్యక్షతన స్పందన  కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి స్పందన అర్జీలను ఆయన స్వీకరిస్తూ,  సమస్యలను పరిశీలిస్తూ సంబందిత శాఖల అధికారులను పిలిచి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తూ తగు ఆదేశాలు జారీచేశారు.  అయితే చాలా శాఖలకు సంబందించి జిల్లా అధికారులుగాక ద్వితీయ శ్రేణి అధికారులు హాజరవ్వడాన్ని ఆయన గమనించి ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  ఈ స్పందన  కార్యక్రమానికి జిల్లా అధికారులు ఏ విధంగా గైరుహాజరుఅవుతారంటూ అసంతృప్తిని వ్యక్తంచేస్తూ  గైరుహాజరు అయిన జిల్లా అధికారులు అందరికీ  తాఖీదులు జారీచేయాలని ఆదేశించారు. స్పందనకు 277 అర్జీలు….  జిల్లా కలక్టేరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. దసరా పండుగ పర్వదినాలు అయినప్పటికీ,  జిల్లా నలుమూల నుండి ప్రజలు పెద్ద ఎత్తున […]

గ్రామ స‌చివాల‌య‌ కార్యద‌ర్శుల‌కు కోరుకున్న చోటే పోస్టింగ్‌…

October 7, 2019 Eerojunews 0

(విజ‌య‌న‌గ‌రం,ఈఎన్ఎస్) జిల్లాలో గ్రామ స‌చివాల‌యాల్లో గ్రేడ్‌-5 కార్యద‌ర్శులుగా నియ‌మితులైన‌ అభ్యర్ధుల‌కు పోస్టింగ్స్ ఇచ్చే నిమిత్తం సోమ‌వారం జిల్లాప‌రిష‌త్ కార్యాల‌యంలో సోమ‌వారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జాయింట్ క‌లెక్టర్‌-2 ఆర్‌.కూర్మనాధ్ నేతృత్వంలో జిల్లా పంచాయ‌తీ అధికారి బి.స‌త్యనారాయ‌ణ‌, జిల్లాప‌రిష‌త్ డిప్యూటీ సి.ఇ.ఓ. […]

గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.. మంత్రి బొత్స సత్యనారాయణ

October 5, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి  పేరు వచ్చేలా అంకిత భావంతో విదులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.  శనివారం చీపురుపల్లి నియోజక వర్గంలోని గుర్ల, గరివిడి మండలాల్లో పర్యటించి  గుర్ల మండల గుర్ల గ్రామం మరియు గరివిడి మండలం కొండపాలెం గ్రామాల్లో గ్రామ సచివాలయాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం గరివిడి శ్రీరామ్ హైస్కూల్ ఆవరణలో జరిగిన బహిరంగ సభ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.  ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ మహత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలులోకి తెచ్చిన తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మారుమూ గ్రామాల్లోని ప్రజలకు సైతం […]