7న సాయుధ దళాల పతాక దినోత్సవం – జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్

December 6, 2019 Eerojunews 0

(విజయనగరం, ఈఎన్ఎస్) సాయుధ దళాల పతాకదినోత్సవాన్ని ఈనెల 7వ తేదీన జరుపుకోనున్నామని,  వీర జవానుల కుటుంబాలకు చేయూత నిచ్చేందుకు పతాక నిధికి విరివిగా విరాళాలు అందించవలసినదిగా జిల్లాలోని పౌరులను, వ్యాపార వేత్తలను, పారిశ్రామిక దారులను జిల్లా కలక్టరు డా. ఎం.  హరి జవహర్ లాల్ విజ్ఞప్తి  చేసారు. జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాకదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి , సాహసం, త్యాగాల పట్ల దేశం గర్వించుచున్నదన్నారు.  పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాలలోను, కార్గిల్ పోరాటంలోను, బొంబాయి తాజ్ హోటల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను మన సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతి యావత్తు గర్వించుచున్నదన్నారు. ఎంతో మంది సైనిక సహోదరులు దేశ రక్షణ కొరకు […]

శాస్త్ర విజ్ఞాన పరిశోధనలతో సమాజ ప్రగతి సాద్యం.. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌

December 6, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ద్వారా లభించే ఫలితాల ద్వారానే సమాజ ప్రగతి సాద్యపడుతుందని, ఈ విషయంలో అభివృద్ది చెందిన దేశాలతో పోల్చితే భారతదేశం వెనకబడి ఉందని గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ పేర్కొన్నారు. […]

అల్లూరి చరిత్ర సాక్ష్యాలు కోరుతూ విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సహ చట్టం దరఖాస్తు

December 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) అల్లూరి సీతారామరాజు చరిత్రకు సంబంధించిన ఆధారాలపై అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు కలెక్టర్ కార్యాలయంలో సహచట్టం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాటి మద్రాసు […]

ఘనంగా ముగిసిన జర్నలిస్టుల క్రీడలు..క్రికెట్‌ విజేతగా వీడియో జర్నలిస్టులు

December 3, 2019 Eerojunews 0

(విశాఖపట్నం,ఈఎన్ఎస్) వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్‌ సౌజన్యంతో విస్జా సహకారంతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడా పోటీలు మంగళవారం అత్యంత ఉత్సాహాభరిత వాతావారణంలో ముగిశాయి. ఈ నెల 25న జర్నలిస్టుల ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ […]

కళాభారతిలో వీనుల విందుగా సాగిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్

December 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖలోని కళాభారతిలో నిర్వహించిన క్రిస్మస్ మ్యూజిక్ కాన్సెర్ట్ వీనుల విందుగా సాగింది. మద్దెలపాలెంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు డా.మహర్షి దర్శకత్వంతో క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజి […]

అల్లూరి వీరోచిత పోరాటం చేసిన గ్రామాన్ని కేడిపేట కాదు క్రిష్ణదేవిపేటగానే పిలవాలి

December 2, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై చేసిన వీరోచిత పోరాట పుణ్యభూమి క్రిష్ణదేవిపేటను ఎవరూ కేడిపేటగా పిలవకుండా చూడాలంటూ అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు స్పందన కార్యక్రమంలో జాయింట్ […]

కళాశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి –  జిల్లా కలెక్టరు జె.నివాస్

December 1, 2019 Eerojunews 0

(శ్రీకాకుళం, ఈఎన్ఎస్) కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు తగు చర్యలు తీసుకోవలసినదిగా మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఇటీవల మహిళా కళాశాలలో జరిగిన స్వచ్చభారత్ కార్యక్రమం సంధర్బంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి […]

విధులకు చేరని గ్రామ,సచివాలయ కార్యదర్శులపై చర్యలు..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ 

November 30, 2019 Eerojunews 0

(పాడేరు, ఈఎన్ఎస్) గ్రామసచివాలయ నియామక ఉత్తర్వులు పొంది విధులకు చేరని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డి. కె. బాలాజీ స్పష్టం […]

జర్నలిస్టులు  క్రీడలు నిర్వహించడం ప్రశంసనీయం-ఎంపి ఎం.వి.వి.సత్యనారాయణ

November 30, 2019 Eerojunews 0

(విశాఖపట్నం, ఈఎన్ఎస్) నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని విశాఖ పార్లమెంట్‌ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ కొనియాడారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సిఎంఆర్‌ సౌజన్యంతో విస్జా సహకారంతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడా పోటీల్లో భాగంగా […]

వ్యక్తిగత పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ

November 29, 2019 Eerojunews 0

(పాడేరు,ఈఎన్ఎస్) అటవీ హక్కుల చట్టం- 2005 ప్రకారం ఆదివాసీ మహిళలకు వ్యక్తిగత పట్టాలు పంపిణీ చేయానికి అవసరమైన చర్యలు చేపట్టామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు శుక్రవారం స్దానిక కాఫీ భవనం […]