ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి…జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు

(ఏలూరు, ఈఎన్ఎస్)
జిల్లాలో జరిగే మొత్తం ప్రసవాలలో 50 శాతం పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సి లలో జరిగేలా చూడాలని వైద్యఆరోగ్యశాఖాధికారులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి వైద్యఆరోగ్యశాఖ అధికారులతో

నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ ప్రసవాలు జరిగేలా ఎఎన్ఎంలు, ఆశావర్కర్లను ఎక్కువ కృషిచేయాలన్నారు. ఎఎన్ఎంలు, ఆశావర్కర్లకు వారి పనితీరును బట్టి ర్యాంకింగ్ ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. గర్భిణీలకు టెస్ట్ లు చేసేందుకు

అవసరమైన పరికరాలు, లాబ్‌లు, లాబ్ టెక్నిషయన్ లను ఏర్పాటు చేసుకోవాలని అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సి లలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఏఒక్కపేషెంట్ ఒక్కమాత్రకూడా కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లడానికి వీల్లేని విధంగా అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో వుంచుకోవాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. ఈ సమావేశంలో డియంఅండ్‌హెచ్ఒ డా .సుబ్రహ్మణ్యశ్వరి, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సివిఆర్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*