ఇవి అమలు జరిగితే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు అంటనే హడలి చస్తారు…

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించిన తరువాత చాలా ఆశక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు మానేశారా లేదా(విధి నిర్వహణ సమయంలో) అనే కోణంలో

విచారణ ప్రారంభించింది. దానికోసం కెజిహెచ్ లోని సిసి ఫుటేజిపై ప్రత్యేకంగా ద్రుష్టి కేంద్రీకరించింది. గతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినా ఇక్కడ పనిచేసే కొందరు వైద్యులు, పీజీ వైద్యులు, ప్రొఫెసర్లు కెజిహెచ్ కి ఎదురుగానే ఉండే పలు ప్రవేటు క్లినిక్స్ లో అవర్ బేసిస్ ప్రాక్టీసు చేసేవారు. అయితే ఈ విషయం ఎవరికీ

తెలిసేది కాదు. ఏదో పనిమీద ఓ గంట పర్మిషన్ అడిగి వెళ్లారునుకునేవారు తప్పితే, ఆ గంట మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రైవేటు ప్రాక్టీసుకి వినియోగించేవారనే విషయాన్ని ఇప్పటి వరకూ ఏవరూ గుర్తించలేదు. కానీ ఇపుడు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించిన తరువాత చాలా అంశాలను పూర్తిస్థాయిలో లెక్కపెట్టేపనిలో పడింది. అవేంటో తెలిస్తే ప్రభుత్వ వైద్యులు విధినిర్వహణ సమయంలో ఆసుపత్రి గేటు దాటి కూడా బయటకి వెళ్లరు. సరికదా ప్రైవేటు క్లినిక్ జోలికి అసలే వెళ్లరు. అయినా పర్లేదు తెలివితేటలు వినియోగించి దొంగచాటు ప్రాక్టీసు చేపడితే వేటు పడటం ఈ క్రింది అంశాల వారీగా ఖాయంగా కనిపిస్తుంది.

అవేంటంటే…
1)ప్రభుత్వ, జిల్లా ఆసుపత్రులకి వైద్యులు సమయానికి విధులకి హాజరు కావాలి
2)ప్రతీ ఒక్క వైద్యుడు, సిబ్బంది సిసికెమెరా పర్యవేక్షణలో బయో మెట్రిక్ వేయాలి
3)వార్డుల్లోనూ, ఓపిల్లోనూ సిసి కెమెరాలు ఏర్పాటు కానున్నాయి, పర్యవేక్షణ ప్రత్యేకంగా చేస్తారు
4)విధి నిర్వహణ సమయంలో నిర్దేశిత కారణం లేకుండా సూపరింటెండెంట్లు కూడా అనుమతిలు ఇవ్వడానికి వీల్లేదు
5)కారణం ఒకటి చెప్పి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాక్టీసు చేసినట్టు రుజువైతే ఉద్యోగం ఊడిపోవడం ఖాయం
6)బయో మెట్రిక్ లో మతలబులకు వీలులేకుండా సెంట్రల్ నెట్వర్క్ సిస్టం ఏర్పాటు
7)ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు ఎన్ని ప్రైవేటు క్లినిక్స్ ఉన్నాయి, ల్యాబ్ లు, స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి ప్రభుత్వానికి నివేదించాలి

8)ప్రైవేటు ఆసుపత్రిలు వారి ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల పేర్లు, మెడికల్ సర్టిఫికేట్లు ప్రభుత్వానికి నివేదించాల్సి వుంటుంది
9)నకిలీ పేర్లు, మెడికల్ సర్టిఫికేట్లు ప్రభుత్వానికి నివేదిస్తే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెడతారు.
10)నగరంలోని ప్రైవేటు ల్యాబులు, స్కానింగ్ సెంటర్లకు వచ్చే వైద్యుల జాబితాలు ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుంది. అలా సమర్పించకపోతే వాటి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు.
11)ప్రతీ ప్రభుత్వ వైద్యుడు, ఫ్రొఫెసర్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కదలికలపై డేగకన్నువుంటుంది…
13)యూనియన్ల పేరుతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచే వైద్యుల పేర్లు, ఐఎంసికి ఫిర్యాదు చేస్తారు, శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు.

14)ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే సమయంలో మా ప్రైవేటు ఆసుపత్రికి వస్తే అక్కడ అన్నీ జరుగుతాయనే పధం వినిపిస్తే వైద్యులను సస్పెండ్ చేయడంతోపాటు, సదరు మెడికల్ సెంటర్, ప్రైవేటు క్లినిక్ కి సంబంధించి అన్ని అనుమతులను రద్దు చేస్తారు.
15)ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యులంతా మందుల పేర్లు కేపిటల్ లెటర్స్ లోనే రాయాలి
16)ఖచ్చితంగా ప్రభుత్వ ల్యాబును మాత్రమే టెస్టులకి వినియోగించాలి
17)ఈ విషయంలో ప్రభుత్వంపై సమ్మె ఒత్తిడి తెచ్చే వైద్యుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారు…
18)ప్రభుత్వ వైద్యసేవాలు పేదవారికి బాగా అందించే వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇస్తారు
19)విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తారు.
20) ప్రైవేటు ల్యాబులు, మెడికల్ సెంటర్లకి ధీటుగా సెంట్రల్ లాబరేటరీ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*