అల్లూరి చరిత్ర పరిశోధకులు బాలు

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
అమెరికా తానామహాసభల్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రపంచ చరిత్రను తెలియజేసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, అల్లూరి చరిత్రపరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తెలియజేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లూరి సంచరించిన ప్రదేశాలతో కూడిన

డాక్యుమెంటరీని కూడా అక్కడ ప్రదర్శించడానికి అమెరికాలోని ప్రవాస భారతీయులతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వివరించారు. అల్లూరి సంచరించిన ప్రదేశాలు, తెల్లవాడిపై సీతారామరాజు మన్యం పితూరి ఉద్యమం చేసిన క్రిష్ణదేవిట ప్రాంతం, రంపచోడవరం, అల్లూరి

సమాధులు, ఆయన రహస్య సమావేశాలు నిర్వహించిన ప్రదేశాలు, అల్లూరి ప్రధాన అనచరులు గాం గంటం దొర, మల్లు దొరలు పుట్టిన ప్రదేశాలతో సైతం ఈ డాక్యుమెంటరీని రూపొందించడం జరిగిందన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారికి అల్లూరి వీరోచిత

పోరాటం తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించామన్నారు. అదేవిధంగా అల్లూరి చరిత్రపైనా, క్రిష్ణదేవిపేట యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే చరిత్రపై ఒక పుస్తకాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. వీటిని కూడా అమెరికాలోని తానా మహాసభలకు తీసుకెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*