విశాఖ ఏవిఎన్ కళాశాలలో నవంబరు 21న అల్లూరి విగ్రహం ఆవిష్కరణ…

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)

విశాఖలోని మిసెస్ ఏవిఎన్ కళాశాలలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు నిలువెత్తు విగ్రహాన్ని ఈనెల 21న ప్రారభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు అల్లూరి చరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు తెలియజేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షులు పడాల వీరభద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

అల్లూరి ఏవిఎన్ కళాశాలలో చదివిన గుర్తుగా విగ్రహాన్ని ఇక్కడ నిర్మించినట్టు చెప్పారు. ఆమహానుభావుడి విగ్రహాన్ని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ ప్రారంభిస్తారని అన్నారు. విగ్రహాన్ని మంతెన వెంకట సత్యన్నారాయణ రాజు(పల్లంకుర్రుబాబు) స్వయంగా చెక్కించారని చెప్పారు. కార్యక్రమానికి విశాఖ జిల్లా అధ్యక్షులు రాజాసాగి

సత్యనారాయణరాజు, ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, ఎ.వి.ఎన్‌.కాలేజీ కరస్పాండెంట్‌ ఎ.వి.అదీప్‌ భానోజీరావు, విగ్రహ దాతలు హాజరౌతారని చెప్పారు. ఈ సందర్భంగా జరిగే సభకు సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు అధ్యక్షత వహిస్తారు. విశిష్ఠ అతిధులుగా సంఘం గౌరవ సలహాదారులు, సూరంపూడి వీరభద్రరావు, అధ్యక్షులు

వబ్బలరెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీకాంత్‌, కోశాధికారి బళ్ళాశ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు దంతులూరి సుబ్బరాజు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పాలా కృష్ణమూర్తి, డా..దాట్ల రామచంద్రరాజు, మద్దాల కళ్యాణ నరసింహరావు, కె.కె.రాజు, వెంపటి మాధవులనాయుడు, దాములూరి విజయప్రకాష్‌, అడ్డాల వెంకట వర్మరాజు, ఆర్‌.వి.ఎస్‌.రాజు, పి.రామాదేవి తదితరులు పాల్గొంటారు. నిర్వాహకులు కుచ్చెర్లపాటి శ్రీరామరాజు ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్ధులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*