దోసకాయ బజ్జీ ( కాల్చి చేసుకునే పచ్చడి )

(ఈఎన్ఎస్ నెట్వర్క్, ఆహా ఏమి రుచి విభాగం)
ప్రతీరోజూ రోట్లో దంచుకొని చేసిన పచ్చడితో భోజనం మొదటిలోనే రెండు ముద్దలు తింటే ఆహా ఏమి అని గుటకలు పడతాయ్…తరువాత మిగిలిన కూరలు వేసుకొని తింటే ఆ అమాజనే వేరుగా వుంటుంది. అందుకోసమే మీకోసం దోసకాయ బజ్జీ అంటే కాల్చి చేసుకునే పచ్చడి తయారీని వివిరిస్తున్నాం…ముందుగా పచ్చని గట్టి దోసకాయను తీసుకొని కాయ అంతా నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టుకొని నాలుగు వైపులా కాల్చుకుని తడి చేయి చేసుకుని కాలిన పై చెక్కు అంతా తీసుకొని , కాయను చిదిపి పైన కొద్దిగా పసుపు వేసి పక్కన ఉంచుకోవాలి. చింతపండు ఉసిరికాయంత పరిమాణంలో తీసుకొని తడిపి ఉంచుకోవాలి .స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు , కొద్దిగా మెంతులు , కొద్దిగా జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించు కోవాలి. ఇప్పుడు రోటీలో ముందు ఎండుమిరపకాయలు ఉప్పు , కొద్దిగా తడిపి ఉంచుకున్న చింతపండు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి . తర్వాత ఆరు పచ్చి మిరపకాయలు కూడా వేసుకొని పచ్చడి బండతో దంపుకోవాలి . తదుపరి కాల్చి చిదిపి పక్కన పెట్టుకున్న దోసకాయ వేసి మరీ మెత్తగా కాకుండా ఫోటోలో చూపిన విధంగా ముక్కలు తగిలే విధంగా బండతో నూరుకుని , మిగిలిన పోపు , సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి పచ్చడి బండతో నూరుకోవాలి . తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయ కాల్చిన పచ్చడి సర్వింగ్ కు సిద్ధం. రాసి పంపిన వారు ఆలూరుకృష్ణప్రసాదు .

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*