2 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ..డెప్యూటీ ఈవో నాగరత్న


(తిరుమల, ఈఎన్ఎస్)
శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో శుక్ర‌వారం వ‌ర‌కు 2 ల‌క్ష‌ల మందికిపైగా భ‌క్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించార‌ని కల్యాణకట్ట డెప్యూటీ ఈవో నాగరత్న తెలిపారు. కల్యాణకట్టల్లో క్షుర‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో భక్తులకు సత్వర సేవలు అందిస్తున్నార‌ని వివ‌రించారు. తిరుమలలోని రాంభగీచా – 2లో గ‌ల మీడియా సెంటర్‌లో శ‌నివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో కల్యాణకట్ట సిబ్బంది సేవలను వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో 185 మంది రెగ్యుల‌ర్‌, 250 మంది పీస్‌రేట్‌, 885 మంది క‌ల్యాణ‌క‌ట్ట క్షురకులు 24 గంటలపాటు భ‌క్తుల‌కు సేవ‌లందిస్తున్నార‌ని తెలిపారు. ప్రత్యేకంగా మహిళా క్షురకులు 274 మంది ఉన్నార‌ని, వీరు మహిళలకు, చిన్న పిల్లలకు తలనీలాలు తీస్తున్నార‌ని వివ‌రించారు. దీని వల్ల భక్తులు వేచి వుండే సమయం తగ్గి త్వరగా తలనీలాలు సమర్పించుకుంటున్నార‌ని తెలియజేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మాజీ స‌భ్యుడు శ్రీ క‌న్న‌య్య మ‌హిళా క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల యూనిఫారాలు అందించార‌ని, త్వ‌ర‌లో పురుషుల‌కు కూడా అందిస్తామ‌ని చెప్పారు. క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కుల‌కు త‌ర‌చూ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనివ‌ల్ల భ‌క్తుల నుండి ఫిర్యాదులు త‌గ్గాయ‌ని తెలిపారు.

ఈ మీడియా స‌మావేశంలో టిటిడి పిఆర్వో డా.టి.ర‌వి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*