వ్యక్తిగత పట్టాలు పంపిణీ చేయడానికి చర్యలు..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ

(పాడేరు,ఈఎన్ఎస్)

అటవీ హక్కుల చట్టం- 2005 ప్రకారం ఆదివాసీ మహిళలకు వ్యక్తిగత పట్టాలు పంపిణీ చేయానికి అవసరమైన చర్యలు చేపట్టామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు శుక్రవారం స్దానిక కాఫీ భవనం సమావేశ మందిరంలో ధాత్రి ట్రస్టు ఆధ్వర్యంలో భూమి, అటవీ హక్కులపై నిర్వహించిన గిరిజన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా విశాఖ మన్యంలో గిరిజనులు సాగులో ఉన్నఅటవీ భూములకు , అటవీ హక్కుల చట్టం అమలు చేసి 35,041 మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసామని వెల్లడించారు. వచ్చే పిబ్రవరిలోపు కొత్తపట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వన సంరక్షణ సమితీలలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

2005 డిసెంబరు 13 లోపు గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాల అందజేస్తామన్నారు.శాటిలైట్ ఫోటోలు సేకరిస్తున్నామని ఆ తేదీకి ముందు సాగులో ఉన్నట్లుగా ఫోటోలో ఉంటే పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. పాడేరు సబ్ కలెక్టర్ డా. వేంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ చింతపల్లి మండలంలో అటవీ భూముల్లో ఉన్న 38 గ్రామాలలో మహిళలపేరు మీద పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

ఏజెన్సీలోని ఆచార ,గిరిజన సాంప్రదాయాల ప్రకారం 95 శాతం భూమి పట్టాలు పురుషుల పేరు మీదే ఉన్నాయన్నారు.36 వేల మంది ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా లబ్దిదారులున్నారని, 26 వేల మందికి రైతు భరోసా అందించామన్నారు. మిగిలిన వారికి వేరే పట్టాలున్నాయని వాటికి రైతు భరోసా అందించామన్నారు. రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి ఇ ఎ ఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ జి. ఓ.ను ఉల్లఘించ కుండా మన్యంలో అటవీ హక్కుల చట్టాలన్ని అమలు చేయాలని కోరారు. దివంగత మాజీ ఐ. ఎ. ఎస్. అధికారి ఎస్ . ఆర్. శంకరన్ అటవీ హక్కల చట్టాన్ని రచించారని చెప్పారు. ఆయన జీవితాన్ని గిరిజను, దళితుల సేవలకు అంకింతం చేసారన్నారు.

ఏజెన్సీలో ఇద్దరు ఐ ఎ ఎస్ అధికారులు ఉన్నారని , గిరిజన భూ సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. భర్త మృతి చెందితే భార్య పేరుమీదకు పట్టాలు బదలాంపు చేయాలని కోరారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ధాత్రి సంస్ధ డైరెక్టర్ కె.భాను మతి, అశోక్ చౌదరి, సలుగు, వంట్ల మామిడి, చీకుమద్దుల పంచాయతీల నుండి పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*