లింగ నిర్థారణ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలి-జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్

(విజయనగరం, ఈఎన్ఎస్)
జిల్లాలో లింగ నిర్థారణ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అద్యక్షతన జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం కలక్టరేట్లో జరిగింది. జిల్లాలో లింగ నిర్థారణ చట్టం

అమలు తీరు, స్కానింగ్ సెంటర్లు పాటిస్తున్న నియమ, నిబంధనలు, వాటి తనిఖీకి అధికారులు తీసుకుంటున్న చర్యలు, నూతన స్కాన్ సెంటర్ల కు అనుమతుల జారీ తదితర అంశాలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నున్న 82 స్కానింగ్ సెంటర్లలో ఇప్పటి వరకూ 36 సెంటర్లను మాత్రమే అధికార బృందం తనిఖీ చేయాడాన్ని ఆయన తప్పు పట్టారు. మిగిలిన 46 స్కానింగ్ సెంటర్లను ఈ

మాసాంతానికల్లా తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మీని ఆదేశించారు. లింగ నిర్థారణ చట్టంపై ప్రజలకు, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా అన్ని పాఠశాలలు, కళశాలల్లో ఈ చట్టం మలుపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ అవగాహన కారక్రమాల నిర్వహణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా అంగన్ వారీ వర్కర్లు సేవలను వినియోగించు కోవాలని సూచించారు.

విజయనగరంలోని ఆర్.కె.ఆసుపత్రి, ఎ.వి.ఎన్.గ్లోబల్ ఆసుపత్రి మరియు బొబ్బిలిలోని శంకర తల్లీ,బిడ్డ ఆసుపత్రిలో స్కానింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈ సమావేశంలో కలెక్టర్ ఆమోదాన్ని తెలిపారు.

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మీ మాట్లాడుతూ జిల్లా దేశంలో కెల్లా విజయనగరం జిల్లాలోనే స్తీ,పురుషుల రేషియో చాలా బాగున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. దేశంలో స్తీ, పురుషుల రేషియో 1000:927 ఉండగా, విజయనగరం జిల్లాలో 1000:950 ఉన్నట్లుగా కలెక్టర్ కు ఆమె వివరించారు.

డిస్ట్రిక్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వి.లక్ష్మీరాజ్య్రం, డి.సి.హెచ్.ఎస్. డా.జి.ఉషశ్రీ, అదనపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.యం.కిషోర్ కుమార్, నేచర్ సంస్థ ప్రతినిథి బంగారు బాబు, లీగల్ కన్సల్టెంట్ యు.రవిశంకర్, డెమో కె.లక్ష్ము నాయుడు, పోలీస్ అధికారి ప్రకాష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*