బిల్లులు చెల్లించకపోతే పంచాయతీ కార్య దర్శులపై చర్యలు..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ

(పాడేరు,ఈఎన్ఎస్)
నిర్మాణాలు పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డి. కె. బాలాజీ హెచ్చరించారు. గురువారం ఆయన కార్యాలయంలో పంచాయతీరాజ్,

గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఎస్ సి ఎ పధకంలో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణాలు, మల్టిపర్పస్ భవనాలు, రోడ్లు, కల్వర్టులు , వంతెలన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఆరు నెలల్లో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

వచ్చే జనవరి 15 వతేదీ నాటికి 50 అంగన్వాడీ భవనాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా గిరిజనులకు అందించాలని ఆదేశించారు. జరిగిన పనులకు త్వరితగతిన బిల్లులు సమర్పించాలని చెప్పారు. గుత్తులపుట్టు, పెదబయలు వారపు సంతల్లో షెడ్డులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. చేసిన పనులకు గుల్లేలు, తుంపాడ పంచాయతీ కార్యదర్శులు బిల్లులు చెల్లించడం

లేదని ఇంజనీర్లు ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే ప్రాజెక్టు అధికారి సంబంధిత ఎం.పి.డి. ఓ కు ఫోన్ చేసి వెంటనే చెల్లించాలని ఆదేశించారు. బిల్లు చెల్లింపులో జప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి చేసిన పనులకు బిల్లులు ఐటిడి ఏ కు సమర్పించాలని ఇంజనీర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈలు కె. వి . ఎస్ . ఎన్.కుమార్, మురళి, పంచాయతీరాజ్ ఈ ఈ కుసుమ భాస్కర్, గిరిజన సంక్షేమ శాఖ డి ఇ లు, డి వి ఆర్ ఎం రాజు, అనుదీప్, 11 మండలాల ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*