బాల బాలికల హక్కులు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తే శిక్షార్హులు..సీనియర్ సివిల్ జడ్జి వి. లక్ష్మీరాజ్యం

(విజయనగరం, ఈఎన్ఎస్)

నేటి బాలలే  రేపటి పౌరులని, బాలల హక్కులను భంగం కలగరాదని, బాలల హక్కులను కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ వి. లక్ష్మీరాజ్యం బాలలను ఉద్ధేశించి అన్నారు.  గురువారం పెద తాడివాడలో ఉన్న మేర్సి మిషన్ స్కూల్ లో బాలల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరమని, అట్టివారు శిక్షింపబడుదరని అన్నారు.  బాల బాలికలను ఉద్ధేశ్య పూర్వకంగా హింసించిన, వారిని అపహరించి వేరోక చోటికి తరలించి వారిచే అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తే చట్టరీత్యా శిక్షార్హులన్నారు.  విద్యార్ధిని, విద్యార్ధులు చక్కటి విద్యను అభ్యసించి, మంచి క్రమశిక్షణ కలిగి, సత్ ప్రవర్తనతో ఉత్తమ విద్యావంతులుగా ఎదగాలని, మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె కోరారు.  ఎంతోమంది పేదవారు ఉన్నతమైన స్ధానాలలో ఉన్నారని, వారిని ఆదర్శింగా తీసుకోవాలన్నారు. బాలుర, బాలికల  మెర్సి మిషన్ చిల్డ్రన్ హోమ్ ను సందర్శించారు.  వసతి గృహాలలో మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహరం అందించాలన్నారు.

 చైల్డ్ వేల్ఫేర్ కమిటీ, నేచర్ చైల్డ్ లైన్ వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజక్టు డైరక్టరు రాజేశ్వరి, జిల్లా బాలల సంక్షేమ సంస్ధ చైర్మన్ వి. లక్ష్మణరావు, మెర్సి మిషన్ స్కూల్ చిల్డ్రన్ హోమ్ కరస్పాండెంట్ చార్లె టామ్, వరల్డ్ విజన్ మేనేజర్ పి. శ్యాంబాబు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆపీసర్ బి.హెచ్. లక్ష్మీ, ఎపిడి శాంతికుమారి, జిల్లా మానవ హక్కుల ఫోరం చైర్మన్ అచ్చిరెడ్డి పాల్గొన్నారు.  స్కూల్ బాల బాలికలు, సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*