పోర్టు క్యాజువల్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి…గంట్ల

(విశాఖపట్నం, ఈఎన్ఎస్)
విశాఖ పోర్టు ట్రస్ట్ లో ఏళ్లతరబడి సేవలందిస్తున్న 270 మంది  క్యాజువల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఇందుకు అవసరమైన వారి అందరి సహకారం తీసుకుంటున్నామని విశాఖ పోర్ట్ ట్రస్ట్ మాజీ సలహాదారు, జాతీయ జర్నలిస్ట్ ల  సంఘం కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు  అన్నారు.శుక్రవారం ఇక్కడ పెందుర్తి సమీపంలో దుర్గా దేవి  ఆలయం వద్ద జరిగిన కార్మికుల సమావేశానికి శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . డి ఎల్ బి నుంచి పోర్టులోకి విలీనమైన 347 కార్మికులలో ఇప్పటి కే 27

మందిని పర్మినెంట్ చేసారని.. మిగిలిన వారిని పర్మినెంట్ చెయ్యాలి అని కోరుతూ  విశాఖ ఎంపీ ఎంవివి  సత్యనారాయణ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారన్నారు … ఇప్పటికే రెండుసార్లు కేంద్ర మంత్రి మాండవీయ ను  కలిసి విజ్ఞాపనలు  అందజేశామన్నారు. ఇటీవలే నగరానికి వచ్చిన కేంద్రమంత్రిని  మరోసారి ఎంపీ కలిసి క్యాజువల్ కార్మికులు కోసం అవసరంఐన. చర్యలు తీసుకోవాలని కోరారని శ్రీనుబాబు చెప్పారు. క్యాజువల్ కార్మికులకు సాయం అందించేందుకు

అన్ని యూనియనల  ప్రతినిధులు..ఉన్నత  అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయి లో సహకారం అందిస్తున్నారని ఇది శుభపరిణామమని శ్రీనుబాబు   పేర్కొన్నారు.త్వరలోనే వీరికి  ఉపాధి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీరు ఆకాంక్ష వ్యక్తము చేసారు. ఈ సందర్భంగా కార్మికులు శ్రీనుబాబు ను  ఘనంగా సత్కరించారు..అంతకు ముందు కార్మికులు అంతా  సాదర స్వాగతం పలికారు.కార్యక్రమంలో పోర్ట్ ప్రతినిధులు వర్మ,కృష్ణ, గోపి,చిన్నా,పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

Attachments area

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*