పిహెచ్ సిల ఆధునీకరణకు అంచనాలు రూపొందించండి..ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ

(పాడేరు,ఈఎన్ఎస్)
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డికె బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎపి ఎస్ ఎం ఐడిసి ఇంజనీర్లతో ఆసుపత్రుల ఆధునీకరణపై

సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆధునీకరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఉన్న భవనాలను మార్చకుండా అదనపు వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మొదటి విడతలో జి.మాడుగుల, కె.డి.పేట, తాజంగి, పెదబయలు, ఉప్ప , ఈదులపాలెం, ఆసుపత్రులను ఆధునీకరిస్తామని చెప్పారు.

ఆసుపత్రులకు,ప్లోరింగ్, ప్రహారీ గోడలు, ఆసుపత్రి ఆవరణలో సిసిరోడ్లు పనులు ,మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రి ఇప్పటికే ఉన్న గదులను మార్పు చేయకూడదన్నారు. అవసరమైన చోట వైద్యాధికారి సూచనల మేరకు అదనపు వార్డులను నిర్మించాలని స్పష్టం చేసారు. ఆసుపత్రి భవనంలో లీకేజీలను అదుపు చేయాలన్నారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ లు కె వి ఎస్ ఎన్ కుమార్, మురళి, ఎపి ఎస్ ఎం ఐ డిసి ఈ ఈ ఉమేష్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ డి. ఇ డివి ఆర్ ఎం రాజు, అదనపు జిల్లా వైద్యాధికారి కిషోర్ కుమార్, వైద్యాధికారులు లీలా ప్రసాద్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*