నిర్మాణపు పనులు డిసెంబరు నెలాఖునాటికి పూర్తి చేయండి…ఐటిడి ఏ పి ఓ డికె బాలాజీ

(పాడేరు ,ఈఎన్ఎస్)

ఏజెన్సీలో రహదారులు, భవన నిర్మాణాలు పనులను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డి. కె. బాలాజీ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో 2017-18 నుంచి 2019-20 వరకు

మంజూరైన స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ , ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 లో రూ.3.97 కోట్లుతో 4 పనులు, 2018-19 లో రూ.15.20 కోట్లతో 20 పనులు 2019-20 ఆర్దిక సంవత్సరంలో రూ.22.10 కోట్ల 39 పనులు మంజూరు చేసామని స్పష్టం చేసారు. రూ.24.08 కోట్లతో 100 పాఠశాలలకు ప్రహారీ గోడలు మంజూరు చేసామని

చెప్పారు.రూ.62.50 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులు అందుబాటులో ఉన్నాయని వాటిని పూర్తిగా ఖర్చు చేయాలని ఆదేశించారు. ప్రణాళికా బద్దంగా బిటి రోడ్లు నిర్మాణాలు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతీ మండలంలో ఐదు బిటి రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. స్పందనలో రోడ్ల నిర్మాణాలకు అధికంగా వినతులు వస్తున్నాయని, రోడ్లు నిర్మించి రవాణా సదుపాయాలు మెరుగు పరచాలని సూచించారు. పూర్తి చేసిన పనులకు బిల్లు సమర్పిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ లు కెవి ఎస్ ఎన్ కుమార్, మురళి, డి ఇ లు డి వి ఆర్ ఎం రాజు ,అనుదీప్, 11 మండలాల ఎ ఇ లు తదితరులు పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*