క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త‌ : ఆనందతీర్థాచార్యులు

(తిరుమల, ఈఎన్ఎస్)
శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల‌కు విచ్చేసిన క‌ళాబృందాల్లో యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌ని, అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌ని టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా – 2లో గ‌ల మీడియా సెంటర్‌లో శ‌నివారం ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ త‌మ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌తో నుండి క‌ళాబృందాలు విచ్చేసి బ్ర‌హ్మోత్స‌వాల 9 రోజుల పాటు ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తున్నాయ‌ని తెలిపారు. ఆయా రాష్ట్రాల సాంస్కృతిక శాఖ సిఫార్సు చేసిన వాటితోపాటు పేరెన్నికగ‌న్న బృందాల‌ను

ఎంపిక చేశామ‌న్నారు. యువ‌తీ యువ‌కులు ఆయా రాష్ట్రాల సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తూ కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, కోలాటం, డోలు, దేవ‌తామూర్తుల వేష‌ధార‌ణ త‌దిత‌ర క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వివ‌రించారు. స్థానిక క‌ళాకారులు త‌మ‌ను సంప్ర‌దిస్తే త‌ప్ప‌కుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.

ఈ మీడియా స‌మావేశంలో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ పాల్గొన్నారు.

About Eerojunews 5685 Articles
నవ్యాంధ్రప్రదేశ్ తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ...రోజు న్యూస్ సర్వీస్(ఈఎన్ఎస్)...ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యమైన వార్తలు, ఫోటోలు, ఫీచర్ ఆర్టికల్స్, లోకల్ కేబుల్ టీవి చానల్స్ కి విజువల్స్ అందించే ఏకైన వార్తా సంస్థ ఈఎన్ఎస్...నేషనల్ న్యూస్ ఏజెన్సీ...

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*